సెంట్రల్ జోన్ నూతన డిసిపిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ అబ్దుల్ బారి
వరంగల్,అక్షిత బ్యూరో : రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్ జోన్ నూతన డిసిపిగా యం.ఎ.బారి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం పోలీస్ కమిషనరేట్ లోని సెంట్రల్ జోన్ కార్యాలయమునకు చేరుకున్న నూతన డిసిపి బారి ఇక్కడి నుండి బదిలీపై వెళ్ళుతున్న అశోక్ కుమార్ నుండి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ పరిధిలో ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐలు నూతన డిసిపి మర్యాదపూర్వకంగా పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు.

ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ బారి 1989 సబ్-ఇన్స్పెక్టర్గా పోలీస్ శాఖలో చేరి ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో పలు పోలీస్ స్టేషన్లలో సబ్-ఇస్స్స్పిక్టర్ పనిచేసి 1999 సంవత్సరంలో పదోన్నతిపై సర్కిల్ ఇన్సెస్పెక్టర్గా లక్షద్దిపేట్, బెల్లంపల్లి, సుల్తానాబాద్ పనిచేయడంతో పాటు ఐక్యరాజ్యసమితి అధ్వర్యంలో శాంతి పరిరక్షణ దళంలో ఒక సంవత్సరం కాలం కోసావ పనిచేసారు. 2009 నుండి డిఎస్పీ హోదాలో నెల్లూరు విజిలేన్స్ విభాగం, జగిత్యాల, హైదరబాద్ లో పనిచేసి 2017 అదనపు డిసిపిగా హైదరాబాద్: సిసిఎస్లో, 2019 సంవత్సరంలో డిసిపిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం డిసిపి హైదరాబాద్ సిసిఎస్ నుండి సెంట్రల్ జోన్ బదిలీ అయినారు. ఎం. ఎబారీ 2003 సంవత్సరంలో మామునూర్ పోలీస్ శిక్షణా కేంద్రంలో ఫ్యాకల్టీగా పనిచేసారు.