రూరల్ పోలీస్ స్టేషన్ ను సంద ర్శించిన పోలీస్ కమిషనర్

రూరల్ పోలీస్ స్టేషన్ ను సంద ర్శించిన పోలీస్ కమిషనర్

◆ 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ ప్రకా రం ఫైల్స్,రికార్డ్స్  సిస్టమెటిగ్గా ఉండాలి

సిద్దిపేట, అక్షిత ప్రతినిధి : నూతనంగా ఆధునికరించిన సి ద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ను  పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సందర్శించారు.ఈ సందర్భంగా చుట్టూ పరిసర ప్రాంతాలు పోలీ స్ స్టేషన్ ఆవరణను పరిశీలిం చారు.పాత పోలీస్ స్టేషన్ నుం చి రికార్డ్స్,ఫైల్స్ తీసుకుని వ చ్చేటప్పుడు  కొత్త పోలీస్ స్టేష న్లో సిస్టమెటిగ్గా 5 ఎస్ ఇంప్లి మెంటేషన్ ప్రకారం ఉండాలని  ఎస్ఐ  కిరణ్,మరియు సీఐ జానకిరామ్ రెడ్డి కి సూచించా రు.పోలీస్ స్టేషన్ ను చుట్టూ పరిసర ప్రాంతాలు పరిశుభ్ర తతో ఆహ్లాదకరమైన  వాతావర ణంలో ఉంచాలని సూచించా రు.ప్రజలకు ఎల్లవేళలా అందు బాటులో ఉండి సేవలు అందిం చాలని సూచించారు.

వర్టికల్ వారిగా విధులు నిర్వహించాల ని విధినిర్వహణలో పోటీ పడా లని సూచించారు.సిసిటిఎన్ ఎస్ ఆన్లైన్ డాటా పర్ఫామెన్స్ ప్రకారం ప్రతి నెల పోలీస్ సిబ్బం దికి రివార్డ్స్,అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఫి ర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడాలని వారి సాధకబా ధకాలు విన్న తర్వాత  వారిచ్చే దరఖాస్తు పై చట్టపరమైన చర్య లు తీసుకోవాలని సూచించా రు.పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తు పై రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు. దరఖాస్తు ఎంక్వ యిరీ పూర్తి కాగానే ఎలాంటి జా ప్యం లేకుండా ఏ రోజుకు ఆరో జు  ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్,సిద్దిపేట ఏసిపి దే వారెడ్డి,సిద్దిపేట రూరల్ సిఐ జానకిరామ్ రెడ్డి,ఎస్ఐ కిరణ్ మరియు పోలీస్ సిబ్బంది పా ల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking