బిఆర్ఎస్ కె.వి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
చేర్యాల,జనవరి 28 అక్షిత ప్రతినిధి: బిఆర్ఎస్ కార్మిక విభాగం నూతన సంవత్సర2023 క్యాలెండర్ను, శనివారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేతుల మీదుగా కె.వి నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటు అనేక సంక్షేమ పథకాలు అంధిస్తు ఉందని,అసంఘటిత రంగ,భవన నిర్మాణ,హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వార ప్రమాధభిమా,ప్రసూతి,వివాహ, మరణం పొందిన కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తు వారికి అండగా ఉంటుంధని, అంధులో భగంగానే కార్మిక విభాగం పనిచేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి ముస్త్యాల గణేష్, చేర్యాల అధ్యక్ష కార్యదర్శులు కంతుల రాజు, కొలిపాక మధు,కొమురవెల్లి మండల నాయకులు వర్గంటి బాబు, ఎక్కలదేవి మల్లేశం,జిల్లా నాయకులు కర్రె నర్సింహులు, తాడూరి సలీమ్, చెరియాల పట్టణ అధ్యక్షులు అన్నబోయిన స్వామి తధితరులు పాల్గొన్నారు.