డబుల్ ఇళ్ల డ్రా రద్దు చేయాలి

డబుల్ ఇళ్ల డ్రా రద్దు
చేసి అర్హులకు ఇవ్వాలి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణంలో పంచినటువంటి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేసి తహసిల్దారు అనిల్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల డ్రాలో పూర్తిగా అవకతవకలు జరగాయని ఆరోపించారు. ఒక్కొక్క వార్డుకు 12 నుంచి 20 వరకు డబల్ బెడ్రూమ్ ఇల్లు రావడం జరిగిందన్నారు. వార్డులో ప్రజలు 150 నుండి 300 వరకు దరఖాస్తులు చేసుకున్నారు ఎంక్వయిరీ పేరిట అమాయక ప్రజలను తొలగించినారని లిస్టులో వచ్చిన పేర్లను కూడా తొలగించినారని ఉన్న పేర్లను డ్రా పద్ధతులు తీయడం వలన డ్రాలో వచ్చినవారు ప్రభుత్వ పరంగా పెన్షన్ తీసుకునేవారు, అంగన్వాడీ టీచర్లు ఎంతో కొంత వ్యాపారం చేసుకునే వాళ్లకే ఈ డ్రాలో ఇండ్లు వచ్చాయని ఈ విధానాన్ని పాటించటం వలన అమాయక ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. 41వ వార్డు గత ఇందిరమ్మ ఇండ్లు వచ్చినప్పుడు ఒకే సామాజిక వర్గానికి 80 ఇవ్వడం జరిగిందని ఇప్పుడు కూడా అదే సామాజిక వర్గానికి ఇళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దానివలన ఎన్ఎస్పి క్యాంపు ప్రజలకు అన్యాయం జరుగుతుందని వారన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లను రద్దుచేసి పూర్తిస్థాయిలో విచారణ చేసి పార్టీలకతీతంగా ముఖ్యంగా వికలాంగులకు మొదటి ప్రాధాన్యత అవకాశం కల్పించాలని వారన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారందరిని గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగినదని ఇండ్ల నిర్మాణం చేసి ఇచ్చారని ప్రభుత్వం కూడా అదే పద్ధతిని పాటించి ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నదని వారన్నారు. ధర్నాలో సిపిఐ మండల కార్యదర్శి ఎండి సయీద్, తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి డి లింగానాయక్, మధ్యాహ్నం భోజనం జిల్లా కార్యదర్శి బంటు రాజేశ్వరి, మండల సమితి సభ్యులు ఎస్కే.షమీం వలపట్ల వెంకన్న, బి మహాలక్ష్మి, ఏ.అలివేలు, పి.మధు, సైదమ్మ, కే రవి, కే.శాంతి, నక్క శాంతి, పి అనూష, ఏ.మారెమ్మ, పీ.గీత పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking