అంబరాన్నంటిన హోలీ సంబరాలు

అంబరాన్నంటిన హోలీ సంబరాలు

ఎస్ ఆర్ డిజి పాఠశాలలో కేరింతలు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
హోళీ సంబరాలు ఎస్ ఆర్ డిజి పాఠశాలలో అంబరాన్నంటాయి. వసంత రుతువు ఆగమనం మనుషులలో ఉత్సాహమే కాదు, ప్రకృతిలో సరికొత్త సొగసు కూడా తెస్తుంది. ఎండిన చెట్లు చిగురించి పూలు పూస్తాయి, ప్రకృతి అందాలు వెదజల్లే వసంత రుతువు తర్వాత వచ్చే తొలి పండగ హోలీ పండుగ సంబరాలను స్థానిక ఎస్ ఆర్ డి జి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరూ ఆప్యాయంగా ఒకరికొకరు రంగులు పూసుకుని హోలీ పండుగను జరుపుకున్నారు. కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఎన్ రవీందర్ మాట్లాడుతూ భారతదేశంలో హోలీ పండుగకు చాలా ప్రాధాన్యత ఉన్నదని అదేవిధంగా హోలీ పండుగ రంగుల పండుగగా మరియు ఒకరికొకరు ఆప్యాయంగా రంగులు చల్లుకునేటువంటి ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని హోలీ పండుగ ప్రాధాన్యతను విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మహమ్మద్ రవుఫ్, నజీర్, పిఈ టి నారాయణ , మహమ్మద్ మునీర్, సరస్వతి, నశ్రీన్, విజయలక్ష్మి, వాణి ,వసంత ముంతాజ్, నేహ, నాగలక్ష్మి అనిత, పుష్పలత శకుంతల, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking