
రేషన్ షాపులను తనిఖి చేసిన జిల్లా కలెక్టర్
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం వివి పాలెం కొణిజర్ల మండలం తణికెళ్ల లోని రేషన్ షాపులను జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సోమవారం ఆకస్మిక తణిఖి చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ రేషన్ షాపుల్లో నిల్వలు పంపిణీ ప్రారంభ నిల్వల వివరాలను పరిశీలించారు. రేషన్ కొరకు వచ్చిన వినియోగదారులతో మాట్లాడుతూ సమయానికి రేషన్ అందుతున్నది లేనిది, తూకం సక్రమంగా ఉంటున్నది లేనిది వివరాలను అడిగి తెలుసుకున్నారు.పంపిణీ ప్రక్రియలో ఏమైన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు.నిల్వ వివరాలు అందించే రేషన్ ఉచితంగా అందిస్తున్నది పట్టికలో పొందుపర్చి వినియోగదారులకు కన్పించేలా స్పష్టంగా వివరాలు బోర్డులో ప్రదర్శించాలని కలెక్టర్ చౌక దుకాణాల డీలర్లను ఆదేశించారు.రేషన్ పంపిణీలో పారదర్శకంగా ఉండేందుకు గాను లబ్ధిదారుడు స్వయంగా వచ్చి రేషన్ తీసుకునే విధానం ద్వారా పంపిణీ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. రేషన్ ఇస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సోములు అధికారులు తదితరులు ఉన్నారు.