వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో
మహిళా దినోత్సవం

*70 మంది మహిళలకు సన్మానం

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్.104 ఎ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో-ఆర్డినటర్ మిర్యాల శత్రయ్య అధ్యక్షతన రీజియన్ చైర్మన్ మాశేట్టి శ్రీనివాసు ఆధ్వర్యంలో ఆర్టీసి బస్టాండ్ లో అంతర్జాతీయ మహిళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలకు ఛైర్స్ గేమ్, రన్నింగ్ గేమ్, టేబుల్ స్పూన్ గేమ్ పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు.

మహిళా కండక్టర్స్, స్వీపర్స్ సన్మానం చేశారు. అదే విధంగా వివిధ రంగాల్లో నెపుణ్యమున్న 70మంది మహిళలను ముఖ్య అతిధి వాసవి వనిత కు వందనం క్లబ్ ఉపాధ్యక్షులు మాశెట్టి గీత ఘనంగా సన్మానించారు. మాశెట్టి గీత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా రాణించాలని, ముందు ఉండాలన్నారు. ఐపిసి మిర్యాల శత్రయ్య మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలు అంది పుచ్చుకోవాలని కోరారు.

5 సంవత్సరాలుగా బస్టాండ్ చలివేంద్రంలో ప్రతి రోజు చల్లని పూరీఫీడ్ మినరల్ వాటర్, చల్లని మఙ్గిగ ప్రయాణికులు, పాదచారులుకు పంపిణి చేస్తున్నామని, వేసవి కాలం ఎండలు దృష్టిలో పెట్టుకొని ముందుగా మార్చి నెలలొనే చలివేంద్రం ప్రారంభం చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లకుమారపు పాండు రంగయ్య, డిస్ట్రిక్ట్ ఇంచార్జి రేపాల శ్రీనివాసు, డిస్ట్రిక్ట్ కో-ఆర్డినటర్ మిట్టపల్లి సంధ్యరాణి, ఆర్ఇసి మందళ్లపు శ్రీనివాస్, రీజియన్ సెక్రటరీ చీదళ్ల శ్రీనివాస్, జోన్ ఛైర్మన్స్ రేపాల వేదశ్రీ, వెచ్చ సతీష్, సామా శ్రీనివాస్, వాసవి క్లబ్ గ్రేటర్, కపుల్స్ క్లబ్, వనితకు వందనం క్లబ్, డైమండ్ క్లబ్, జస్టిస్ అడ్వొకేట్ ఈ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు, ఆర్టీసి డిపో మేనేజర్ బి.పాల్, స్టాఫ్, లేడీ కండక్టర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking