*నేటి నుండి శ్రీ పార్వతీ
రామలింగేశ్వర స్వామి జాతర
అక్షిత ప్రతినిధి, వేములపల్లి :
అది కాకతీయుల నాటి చారిత్రక ఆలయం.
వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలోని కాకతీయుల కాలం నాటి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం సందర్భంగా నాలుగు రోజులపాటు అంగరంగ వైభవం గా నిర్వహించనున్న జాతర జాతర నేటి నుండి ప్రారంభం కానున్నట్లు దేవాలయ కమిటీ చైర్మన్ మేకల వెంకన్న జ్యోతిర్మయి ఆలయ అర్చకులు సతీష్ శర్మ తెలిపారు.
ఆదివారం ఉదయం 10 గంటలకు గణపతి పూజ మండపారాధన పుణ్య ఆచవనం కలశ స్థాపన రక్షాబంధనం, సాయంత్రం నాలుగు గంటలకు అంకురారోపణ ధ్వజారోహణం అఖండ దీప స్థాపన తీర్థం ప్రసాద వినియోగం నిర్వహిస్తారు.
జాతరలో భాగంగా రెండవ రోజు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం , తీర్థ ప్రసాద వినియోగం సాయంత్రం 6 గంటలకు మంటప అవహేత పూజలు రుద్ర హోమం తీర్థ ప్రసాద వినియోగం రాత్రి నాలుగు గంటల 30 నిమిషాలకు తెల్లవారితే మంగళవారం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కల్యాణగ్రామోత్సవం నిర్వహించి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు చండీ హోమం తీర్థ ప్రసాద వినియోగం మధ్యాహ్నం ఒంటిగంటకుదాతల సహకారంతో మహాఅన్నదాన కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు మంటప అవహిత పూజలు తీర్థ ప్రసాద వినియోగం ఏడు గంటలకు ప్రముఖ సినిమాకళాకారులతో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాత్రి నాలుగు గంటల 30 నిమిషాలకు తెల్లవారితే బుధవారం అగ్నిగుండాలు నంది వాహన సేవ జాతరలో భాగంగా నాలుగవ రోజు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ భద్రకాళి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలు జరుపనున్నట్లు దేవాలయ కమిటీ చైర్మన్ మేకల వెంకన్న తెలియజేశారు. తెలుగురాష్టాలలో ఇతర ప్రాంతాలనుంచి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలుఏర్పాటు చేశామనిఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు.