స్త్రీ శక్తి అపారం

స్త్రీ శక్తి అపారం

ఘనంగా మహిళా
దినోత్సవ వేడుకలు

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ లోగల కార్పొరేటర్ వార్డ్ కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలు సమాజంలో పురుషులతో సమానంగా గౌరవించబడినప్పుడే సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మనకు వారసత్వంగా వచ్చిన పితృస్వామికి భావజాలం మూలంగా ఆడపిల్లలు తీవ్రమైన వివక్షకు గురి కాబడుతున్నారని, ఇది మన సమాజానికి మన బిడ్డల భవిష్యత్తుకు ఎంత మాత్రం మంచిది కాదని తెలిపారు. స్త్రీలను బాలికలను సమూనక్తంగా గౌరవించి వారిని ఆదరించడం ప్రతి పురుషుడి యొక్క కనీస ధర్మమని తెలిపారు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ స్త్రీలు అన్ని రంగాలలో ముందుండాలని వారికి సమాజంలో సమాన స్థానం గౌరవం దొరకాలని గొప్ప ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసి చిత్తశుద్ధితో అమలుపరిచి ఆడబిడ్డలలో ఆత్మస్థలాన్ని నింపుతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకళ, చంద్రకళ, భాగ్యలక్ష్మి, సౌజన్య, జయ, శశికళ, రమాదేవి, కుమారి, కళ్యాణి, రోజారాణి, సుధారాణి, రాములమ్మ, బస్వరాజ్ లింగయత్, గోపాల్ యాదవ్, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking