కనుకుర్తిలో పశువుల దొడ్డి వద్ద అగ్ని ప్రమాదం తప్పించిన జర్నలిస్ట్ టి.హన్మంత్*

*కనుకుర్తిలో పశువుల దొడ్డి వద్ద అగ్ని ప్రమాదం తప్పించిన జర్నలిస్ట్ టి.హన్మంత్*

నారాయణ పేట,అక్షిత ప్రతినిధి:

దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో భూ నిర్వాసితులతో సమావేశం సందర్భంగా అక్షిత జిల్లా రిపోర్టర్ టీ. హన్మంత్ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన సందర్భంలో అప్రమత్తంగా వ్యవహరించి అగ్ని ప్రమాదాన్ని అడ్డుకున్నారు.

గ్రామంలోని రైతు వేదికకు అనుకోని ఉన్న పశువుల దొడ్డి వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టు గమనించిన ఆయన వెంటనే స్పందించి,దగ్గరలో లభ్యమైన నీటిని ఉపయోగించి మంటలను ఆర్పారు.ఆయన సమయోచిత చర్యల వల్ల మంటలు వ్యాపించకుండా అడ్డుకట్ట పడింది.

ఈ ఘటనలో ముఖ్యంగా పశువుల గడ్డి (మేత) మంటలకు ఆహుతి కావడం తప్పించబడింది. లేకపోతే భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.టీ. హన్మంత్ తీసుకున్న ఈ ధైర్యవంతమైన చర్యలకు సర్పంచ్ నారాయణ, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. సమయానికి స్పందించి ప్రమాదాన్ని నివారించడం ద్వారా ఆయన బాధ్యతాయుతమైన పౌరునిగా నిలిచారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking