ఘనంగా శబరిమలలో అయ్యప్ప స్వామి జయంతి వేడుకలు
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైత్రమాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్కు చెందిన టీచర్ గురుస్వామి పల్లపు బుద్ధుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్పస్వామికి అష్టోత్తరాలు, అభిషేకాలు నిర్వహించి కానుకలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జరిగే అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం తనకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుందని గురుస్వామి బుద్ధుడు తెలిపారు. ఈ ఏడాది కూడా అయ్యప్ప మాలాధారణ స్వాములు, సివిల్ స్వాములు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు. అయ్యప్పస్వామి దర్శనం ఎన్నిసార్లు చేసినా తనివితీరదని, శబరి యాత్ర అన్ని యాత్రల కంటే మహిమాన్వితమైనదని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పాకాల దినేష్, హనుమాన్ భక్తులు బోలుగూరి సైదులు, పల్లపు సాయి తదితరులు పాల్గొన్నారు.
