తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలి

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలి

తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య

ఖమ్మం/అక్షిత బ్యూరో :

హైదరాబాదులో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కేకే కమిటీ ఆహ్వానం మేరకు సోమవారం తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య కమిటీ సభ్యులు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ రాములు నాయక్ లను కలిసి తెలంగాణ ఉద్యమకారుల కొరకు పలు సలహాలు సూచనలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం 25 వేల పెన్షన్ ఉచిత రైల్వే బస్సు పాసులు ఇప్పించాలని హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారులకు ఇంటి స్థలం కేటాయించాలని ఉద్యమకారులకు ప్రత్యేకంగా హాస్పటల్ నిర్మించాలని కమిటీకి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా  సోమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కల సహకారం మాత్రమే అయినదని ఇంకా తెలంగాణలో పాలనలో ఆంధ్రుల పెత్తనం కొనసాగుతున్నదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు అంగిడి బిక్షం అనంతుల మధు తునికిపాటి చారీ రాజేష్ నాయక్ కుక్కల సత్యం మీగడ రామారావు ఉల్లంగి పద్మ కలకోట అరుణ మంగీలాల్ నాయక్ రామ్మూర్తి నాయకుడు తుడుం వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking