సమస్యల సుడిగుండంలో చింతపట్ల గ్రామం
సిపిఎం పార్టీ గ్రామ ఉపసర్పంచ్ కాయితి శ్రీనివాస్ రెడ్డి
రంగా రెడ్డి అక్షిత బ్యూరో :
యాచారం మండల పరిధిలోని చింతపట్ల గ్రామంలో నెలకొన్న స్థానిక సమస్యల పైన సిపిఎం పార్టీ బృందం పరిశీలన,చింతపట్ల గ్రామ సిపిఎం పార్టీ ఉపసర్పంచ్ కాయితి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో అనేక రకాల సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటిని సిపిఎం పార్టీ బృందంతో సోమవారం రోజున గ్రామం మొత్తం తిరిగి పరిశీలన చేసాము అన్నారు. గ్రామంలో అండర్ డ్రైనేజీలు సమస్య ఎంతగానో ఉందని,ఎస్సీ వాడలో అంగన్వాడి నుంచి మొదలుకొని చెక్క లక్ష్మమ్మ ఇంటి వరకు ఈ అండర్ డ్రైనేజీ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది అన్నారు. అట్లాగే గ్రామంలో వార్డుల వారీగా తిరిగిన క్రమంలో 9వ వార్డులో కనుక చూస్తే వీరబొమ్మల వెంకటయ్య ఇంటి నుంచి ఎస్సీ వాడలో పసుల ఆసుపత్రి వరకు పెద్ద అండర్ డ్రైనేజీ ఇప్పటివరకు ఎలాంటి పనులు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు మూడు దశాబ్దాల నుంచి ఈ అండర్ డ్రైనేజ్ కి మోక్షం ఇప్పటివరకు లేదని దాదాపుగా 20,30 సంవత్సరాల నుంచి ఓపెన్ గా ఉన్నటువంటి ఈ డ్రైనేజీని అధికారులు పట్టించుకోవాలని అన్నారు. ఎస్సీ వాడలో రెండు బోర్లు వాడకంలో లేవు జోగు రాములయ్య ఇంటి వద్ద ఉన్న బోరు బావి వాడుకలోకి తేవాలని ఎస్సీ కాలనీవాసులు కోరుతున్నారు. బీసీ ఏరియాలో పరిస్థితి ఇంకా అదో పరిస్థితిలో ఉంది అన్నారు. పిరాటి వెంకటయ్య ఇంటి నుంచి కాక్లారం లక్ష్మారెడ్డి ఇంటి వరకు సిసి రోడ్డు ఇప్పటికి పెండింగ్లో ఉంది అన్నారు. మన గ్రామంలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఏడో వార్డులో పరిస్థితి వీధిలైట్లు దూరంగా ఉన్నట్టు సిపిఎం పార్టీ బృందం గుర్తించింది మహమ్మద్ షకీల్ ఇంటి నుంచి దేశిడి యాదయ్య ఉంటున్న ఈ ఏరియాలో వీధి తంబాల సమస్య నెలకొన్నది. ఈ సమస్యలు అన్నింటిని ఉన్నత అధికారులు మండల అధికారులు, గ్రామ అధికారులు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు లేనియెడల సిపిఎం పార్టీ చింతపట్ల గ్రామ శాఖల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు పిరాటి వెంకటయ్య, ఆలంపల్లి జంగయ్య, చింతపట్ల సిపిఎం శాఖ కార్యదర్శిలు సిహెచ్ సత్యం, కుంటుర గిరికాంత్,అచ్చును రమేష్, మోత్కుపల్లి రమేష్, మస్కు శివలీల గణేష్, కోరింక రమేష్, కొండ్రు శీను, కాకులారం యాదగిరి, జి ప్రభాకర్, నారుమల్ల నరసింహ, జిల్లా శేఖర్, సిద్ధ గొని కాటంరాజు, మస్కు ప్రశాంత్ సిపిఎం పార్టీ కార్యకర్తలు తదితర గ్రామ ప్రజలతో కలిసి కార్యక్రమాన్ని కొనసాగించారు.