బి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం
ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బూడిద నందా రెడ్డి
రంగారెడ్డి అక్షిత బ్యూరో :
ఇబ్రహీంపట్నం మండల కేంద్రం ఓం చౌరస్తాలో సోమవారం బి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ తనయుడు బూడిద సాయి కీర్తన్ రెడ్డి జన్మదిన జ్ఞాపకార్థం సందర్భంగా బి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బూడిద నందా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా బూడిద నందా రెడ్డి మాట్లాడుతూ బి ఆర్ ఆర్ చైర్మన్ బూడిద రాంరెడ్డి తనయుడు సాయి కీర్తన్ రెడ్డి జ్ఞాపకార్థం గత మూడు రోజుల నుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉప్పరిగూడ గ్రామం, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో, యాచారం మండల కేంద్రంలో, తుర్కయంజాల్ మున్సిపాలిటీలో, అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. అదేవిధంగా సాయి కీర్తన్ రెడ్డి జన్మదిన జ్ఞాపకార్థం సోమవారం రోజు మండల కేంద్రంలో అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహాదానమని ఆయన అన్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపు నిండా అన్నం పెట్టి నిరుపేదలకు సేవ చేయడం గొప్ప విషయం అన్నారు. అత్యవసర పరిస్థితిలో ఆపదలో ఉన్నవారికి ఎల్లవేళలా అందుబాటులో బూడిద రాంరెడ్డి ఉంటారని అన్నారు . ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డిని, ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ అన్నదాన కార్యక్రమం 5000 మందికి అన్నదాన వితరణ జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొండ్రు ప్రవీణ్, గూడూరు గిరి , సర్పంచులు శ్రీ వేణి నందకుమార్, జోగు శంకరయ్య, శ్రీను, జయచంద్ర నాయక్, మాజీ కౌన్సిలర్ గుండ్ల రాజిరెడ్డి, మాజీ సర్పంచులు చిలుకల యాదగిరి, ఫౌండేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న వితరణ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.
o