ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
– ప్రజావాణి లో వినతి పత్రం అందజేత
– నీర్నెముల గ్రామస్తుల పిర్యాదుతో కలెక్టర్ స్పందన
– తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులకు విచారణ ఆదేశాలు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
మండల పరిధిలోని నీర్నేముల గ్రామంలో ప్రభుత్వ, కుంట, శిఖం భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని గ్రామ బాధ్యతాయుత పౌరులు మరియు గ్రామస్తుల తరఫున ఫిర్యాదు చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో తహసీల్దార్ అధికారిక ఉత్తర్వులు (Endt.No.D/470/2026) జారీ చేసినప్పటికీ, మరియు ప్రముఖ దినపత్రికలలో వార్తలు వచ్చినప్పటికీ, నేటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఉమ్మడి సర్వే లేదా కబ్జాల తొలగింపు చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం వల్ల అక్రమార్కులు విచ్చలవిడిగా చెరువు శిఖం భూములను కబ్జా చేస్తూ, పంటలు పండిస్తూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని వివరించారు. వివరాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి, ఈ విషయంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, ఇరిగేషన్ ఈఈ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు తరాల కోసం ఉన్న ఈ ఉమ్మడి పబ్లిక్ భూములు, పర్యావరణ పరిరక్షణకు అత్యంత కీలకమని, అధికారుల నిర్లక్ష్యం వీడి తక్షణమే సర్వే చేపట్టి అక్రమ ఆక్రమణలను తొలగించాలని గ్రామస్తులు కోరారు.
