ది గ్రీన్ అండ్ షేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుణ యాగం

ది గ్రీన్ అండ్ షేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుణ యాగం

– వరుణ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, కౌన్సిలర్లు

తాండూరు, అక్షిత ప్రతినిధి:

ప్రజలు, రైతులు, వ్యాపారులు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ఆకాంక్షిస్తూ.. తాండూరు ది గ్రీన్ అండ్ షేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరుణ యాగంలో సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మరియు నాయకులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతుల పంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారులు అభివృద్ధి చెందాలని, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అని అన్నారు. ఈ కార్య క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ది గ్రీన్ అండ్ షేడ్స్ అసోసియేషన్ ప్రతి నిధులు, సీనియర్ నాయకులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు, సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి, తాండూరు మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, సర్పంచ్ పాండురంగా రెడ్డి, కౌన్సిలర్లు నవీనా, సుప్రీతా, నాగలక్ష్మి, సురేష్ నాయక్, నాయకులు వరాల శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ గౌడ్, కరుణా కర్ పటేల్, మహేశ్వర్ రెడ్డి, చందు ముదిరాజ్, చెన్నా రెడ్డి, అనంతరెడ్డి, రమేష్ గౌడ్, భీమ్ రెడ్డి, తది తరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking