*కానుకుర్తి భూ నిర్వాసితుల రైతులతో సమావేశమైన కుంభం శివకుమార్ రెడ్డి*
*50 శాతం రైతులకు పరిహారం అందింది!! త్వరలో మిగతా 50% రైతులకు అందించేందుకు కృషి చేస్తానని హామీ*
*ఆదివారం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు రైతుల అంగీకారం!!*
*భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ*
*రాజకీయాలకు అతీతంగా ప్రాజెక్టుని పూర్తిచేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి – కుంభం*
నారాయణ పేట,అక్షిత ప్రతినిధి:
దామర గిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో రైతు వేదిక దగ్గర నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులతో మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి సమావేశమైనారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూనిర్వాసితులను అన్ని విధాన ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పథకాలలో భూమి రాసితులకు మెదటగా పథకాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.50 శాతం రైతులకు నష్టం పరిహారం చెల్లించామని,మిగతా రైతులకు కూడా త్వరలో పరిహారం అందిస్తామని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని,పనులు సాఫీగా జరిగేలా సహకరించాలని కోరారు.రైతుల సందేహాలను నివృత్తి చేశారు.రైతుల సమస్యలను స్థానిక తాసిల్దార్ తిరుపతయ్య నోట్ చేసుకొని రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.కొంతమంది రైతులు సమస్యలు పరిష్కారం కావడంలేదని నిరసన భావ వ్యక్తం చేశారు.శివకుమార్ రెడ్డి హామీతో సంతృప్తి చెందిన రైతులు పనులు త్వరగా పూర్తి చేయడానికి సహకరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణ,ఉపసర్పంచ్,మండల సింగల్ విండో మాజి చైర్మన్ పుట్టి ఈదప్ప,కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ బాల్రెడ్డి, మండలంలోని గ్రామాల సర్పంచులు శరన్ నాయక్,హన్మంతు,శ్వేత శివకుమార్,మాజి ఎంపిటిసి బస్వరాజ్,కాంగ్రెస్ గ్రామ నాయకులు అశోక్, గ్రామ భూ నిర్వాసితుల రైతులు అశోక్,సిపిఎం నాయకులు మొగలప్ప, రైతులు, తదితరులు పాల్గొన్నారు.