రియల్ “రారాజుగా” ఎదగాలి

రియల్ “రారాజుగా” ఎదగాలి

రాజా ఇన్ ఫ్రా రాష్ట్ర
మంతా విస్తరించాలి

బిఆర్ ఎస్ రాష్ట్ర యువజన నేత ముఠా జయసింహ

తార్నాక, అక్షిత ప్రతినిధి :

రియల్ రంగంలో పారదర్శకంగా సేవలందించి రాజా ఇన్ ఫ్రా తెలంగాణ అంతటా వెంచర్లతో విస్తరించి రియల్ రారాజుగా ఎదగాలని బిఆర్ ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జయసింహ ఆకాంక్షించారు. గురువారం తార్నాకలోని రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా రూపొందించిన రాజా ఇన్ ఫ్రా లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దంన్నర కాలంగా రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు రియల్ రంగంలో పారదర్శకంగా విశిష్ఠ సేవలందిస్తూ 18 వెంచర్లను పూర్తి చేసిన అనుభవంతో మరిన్ని వెంచర్లతో విస్తరించి తెలంగాణ వ్యాప్తంగా ప్లాట్లు, అపార్ట్మెంట్లతో అత్యుత్తమ స్థాయికి ఎదగాలన్నారు.

కస్టమర్ల పెట్టుబడికి అనుగుణంగా ఆయా ప్లాట్ల విలువలు పెరిగినప్పుడు ఆయా కస్టమర్లు సంస్థ మనుగడకు మరింత ఊపిరిగా నిలుస్తారని ఆయన చెప్పారు. సంస్థ ఎంచుకున్న లక్ష్యాలకు కస్టమర్ల విశ్వసనీయత తోడైతే ఆ సంస్థ పురోగతికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రియల్ రంగంలో రాజు చేరిన తొలినాళ్ళ నుంచి పారదర్శకంగా సేవలందిస్తుండడంతోనే ఇంతటి స్థాయికి చేరుకున్నారని, అదే స్ఫూర్తి, ఒరవడితో మరింత ఉజ్వల భవిష్యత్తును పొందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. డిజిటల్ డ్రాప్ సొల్యూషన్ ఫౌండర్, సీఈఓ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఏ సంస్థకైనా ఆయా కస్టమర్ల నమ్మకం… విశ్వసనీయతను బట్టే ఆ సంస్థ భవిష్యత్ కు బాటలు వేస్తుందన్నారు. డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఎప్పటి కప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా అప్డేట్ అవుతూ ముందుకు సాగాలన్నారు. ఎన్నో కంపెనీలకు మా డిజిటల్ డ్రాప్ సొల్యూషన్ ప్రమోషన్ వర్క్ చేస్తుందని,అంతర్జాతీయ ప్రమాణాలకు అణుగుణంగా ఆయా కంపెనీలకు డిజిటల్ సేవలందిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు మాట్లాడుతూ 18 వెంచర్లను
పూర్తి చేసి 8వేల మంది కస్టమర్లకు సేవలందించామన్నారు.

వరంగల్ హైవే, ముంబాయ్ హైవే, శ్రీశైలం హైవే, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో ప్రాజెక్ట్స్ పూర్తి చేశామని, రానున్న రోజుల్లో తెలంగాణలోని పేరెన్నిక గల ప్రాంతాల్లో భారీ ప్రాజెక్ట్స్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. తొలుత కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ శివకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ లు రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజును శాలువా కప్పి పూల బొకేతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అక్షిత చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి, బి ఆర్ ఎస్ నేత కేటీఆర్ యూత్ ప్రెసిడెంట్ కృపి, రాజా ఇన్ ఫ్రా మార్కెటింగ్ డైరెక్టర్స్ కళ్యాణ్ , కీర్తనారెడ్డి, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking