ఆస్తిపన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలి

ఆస్తిపన్ను చెల్లించి
అభివృద్ధికి సహకరించాలి

*రూ.17కోట్లు బకాయిలు
*చైర్మన్ భార్గవ్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : ఆస్తి పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మిర్యాలగూడ మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ కోరారు. శుక్రవారం స్థానిక మునిసిపల్ చైర్మన్ ఛాంబర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.8.83కోట్లు డిమాండ్ కాగా రూం.5.56కోట్లు వసూలు చేశామన్నారు. పాత బకాయిలు రూ13.08కోట్లున్నాయని మొత్తం రూ.16.69 కోట్లని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలు 3కోట్ల రూపాయలు బకాయిలున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బకాయిలు వసూలుకు జిల్లా కలెక్టర్ కు వివరిస్తాన్నారు. కొత్త రెవిన్యూ రికవరి చట్టం కింద జిల్లా కలెక్టర్ అనుమతితో నోటీసులిచ్చి జప్తులు చేపడ్తామన్నారు. అదేవిధంగా నల్లా పన్ను సుమారు కోటి రూపాయలున్నాయన్నారు. పన్ను వసూలుకు వచ్చే సిబ్బందికి సహకరించాలన్నారు. సమావేశంలో మునిసిపల్ కమీషనర్ రవీంద్ర సాగర్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking