త్వరలో రెడ్డి, వైశ్య కార్పోరేషన్ లు

త్వరలో రెడ్డి, వైశ్య కార్పోరేషన్ లు
  మండలి చైర్మన్ గుత్తా

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి, వైశ్య కార్పోరేషన్ లను త్వరలో ఏర్పాటు చేయనున్నదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రగడ్డి అన్నారు. శుక్రవారం సిడిపి నిధులు 50లక్షలతో ఏడు కోట్ల తండా దగ్గర్లో ఉన్న రెడ్డి సంక్షేమ సంఘం స్థలంలో శుక్రవారం రాజా బహదూర్ వెంకట్రాంరెడ్డి రైతు విజ్ఞాన వికాస కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో సిఎం కెసిఆర్ ప్రకటిస్తారన్నారు. రాష్ట్ర శాసనసభలో 40 మంది రెడ్డి ఎమ్మెల్యేలున్నారని అదంతా ఇతర కులాలు, మతాల వారు సహకరించినందున సాధ్యమైందన్నారు. భవనంలో అన్ని వర్గాలు, మతాల విద్యార్ధులకు హాస్టల్ లో 15 శాతం అన్ని చోట్లా కల్పించామని, మిర్యాలగూడలో కూడ కల్పించాలన్నారు. ఈ ఏడాది భవన నిర్మాణానికి రూ.50లక్షల రూపాయలు, వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రూ.50లక్షలు 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఇస్తానన్నారు. నిరుపేద రెడ్లు ఓబీసీ కింద కళ్యాణోత్సవాలు తదితర స్కీంలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిఎల్ఆర్ తో కలిసి తనవంతుగా గది నిర్మాణానికి ఆర్ధికసహాయ మందిస్తానని నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తంకుమార్రెడ్డి అన్నారు.

సంఘం వారు వస్తే సిమెంట్ ఫ్యాక్టరీల నుండి సిమెంట్ విరాళంగా సేకరణ చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, కాంగ్రెసు మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, ఎంపిపి నూకల సరళ హన్మంతరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనుముల మధుసూధన్ రెడ్డి, పి.చెన్నారెడ్డి, పాశం నర్సింహారెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రేపాల పురుషోత్తంరెడ్డి, కౌన్సిలర్ నాగం జయలక్ష్మి జలంధర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు ఎన్.నరెందర్రెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking