రాహుల్ గాంధీ అనర్హత వేటుపై భగ్గుమన్న యూత్ కాంగ్రెస్

రాహుల్ గాంధీ అనర్హత వేటుపై భగ్గుమన్న యూత్ కాంగ్రెస్

-టైర్లకు నిప్పు అంటించి ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం

-యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ తో సహా పలువురు అరెస్ట్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఖండిస్తూ ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు.ఖమ్మం నూతన బస్టాండ్ వద్ద ఖాళీ టైర్లకు నిప్పంటించి ప్రధానీ నరేంద్ర మోడీ దిష్టి దహనం చేశారు.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ గారు మాట్లాడుతూ బిజెపి దేశ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని, అవినీతిని అన్యాయాన్ని దేశ సంపదను దోచుకుంటున్న వారిని ప్రశ్నింస్తున్న రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసి శిక్ష వేసి పూర్తీ స్థాయి తీర్పు వెల్లడించక ముందే అనర్హత వేటు వేయడాన్ని ప్రజాస్వామ్యక వాదులు ఖండించాలని కోరారు.అలాగే ఈ దేశ సంపదను ఆధాని అంబానీ తో పాటు కొంత మంది గుజరాతీ వ్యాపారవేత్తలకు దాచిపెట్టే విధానాన్ని దేశ ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న రాహుల్ గాంధీ గారిపై మోడీ కుట్రలు చేస్తున్నారని అని అన్నారు.130 కోట్ల ప్రజల పక్షాన రాహుల్ గాంధీ పోరాడుతుంటే ముగ్గురు నలుగురు గుజరాతీ వ్యాపారవేత్తల కోసం నరేంద్రమోడీ పనిచేస్తున్నారు అని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ తెలిపారు.రాహుల్ గాంధీ పార్లమెంట్ లో సంధించిన ప్రశ్నకు సమాధానం లేకనే రాహుల్ గాంధీ గొంతు నొక్కేందుకు ఎంపి పదవి నుండి అనర్హత చేశారు అని పేర్కొన్నారు.యూత్ కాంగ్రెస్ నిరసనతో నూతన బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సైదేశ్వర రావు బెజ్జం గంగాధర్ నెల్లూరి ఉపేందర్ మధిర పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి బొల్లం మహేష్ యాదవ్ ఖమ్మం అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొండూరి హృదయ్ కిరణ్ పాలేరు ప్రధాన కార్యదర్శి చెన్ను వెంకట రమణ బెల్లి శ్రీశైలం ప్రధాన కార్యదర్శి బాలు, ఖమ్మం రూరల్ సింగరేణి తిరుమలయపాలేం మండల కో ఆర్డినేటర్స్ కోటి రమణ గుగుళోత్ హర్ష నాయక్ బత్తుల రమేష్, ఖమ్మం టూ టౌన్ యూత్ నాయకులు పేరం యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking