దళితబంధులో డక్కలి కులస్తులకు ప్రాధాన్యత కల్పించాలి

దళితబంధులో డక్కలి కులస్తులకు ప్రాధాన్యత కల్పించాలి

తెలంగాణ డక్కలి హక్కుల పోరాట సమితి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకంలో డక్కలి కులస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డక్కలి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ డక్కలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ముఖ్య నాయకుల, కార్య కర్తల సమావేశం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన సమితి ఇంచార్జ్ రామారావు మాట్లాడుతూ ఎస్సీ జాబితాలోని 59 కులాలలో డక్కలి సామాజిక వర్గం అత్యంత వెనుకబడిన కులం అని గుర్తు చేశారు. సమాజంలో తరతరాలుగా బానిసత్వంలో మగ్గుతూ జీవిస్తున్న డక్కలి సామాజిక వర్గం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవా లన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి పేదలకు పంపిణీ చేసే డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న గృహలక్ష్మీ పథకంలో అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలాంటి అర్హత పరీక్ష లేకున్నా డక్కలి కులస్తులకు అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. ఎస్సీ ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ, డ్రైవర్ కమ్ ఓనర్ పథకంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చదువుకున్న యువతకు ప్రభుత్వ సహకారంతో విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకో వాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ తాత్కాలిక అధ్యక్షులుగా మహాంకాళి అశోకన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్వరలో పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడానికి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాలని సమావేశం తీర్మాణం చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ డాకూరి లింగరాజు, కార్యదర్శి అంథోని వెంకన్న, మహాంకాళి లక్ష్మయ్య, గౌరప్ప, లక్ష్మణ్, కర్నెకంటి వెంకటేష్, కర్నె రంగస్వామి, డాకూరి లింగయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking