వడ్డేపల్లిని సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన కమిటీ సభ్యులు
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
హనుమాన్ నగర్ లో గల సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరు కావలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు టిటిడి బోర్డు అడ్వైజర్ కమిటీ సభ్యులు బిజెపి సీనియర్ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావును ఆదివారం ఆహ్వానించారు. గురువారం హనుమాన్ నగర్ లోని వీరాంజనేయ దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రావలసిందిగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏం. విటల్, టి నర్సింలు, శంకర్ సింగ్, బాలు యాదవ్, టైల్స్ శీను, ఎర్రన్న,జోగారావు, అప్పారావు, విట్టల్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.