
మోడీ హటావో దేశ్ బచావో : యుగంధర్ రెడ్డి
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో రాహుల్ గాంధీ పై అక్రమంగా అనర్హత వేటువేయడాన్ని నిరసిస్తూ గాంధీభవన్ లో పిసిసి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిరసన దీక్షలో పాల్గొన్న ఏ బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి. ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మాదరి శ్రీనివాస్,బాలానగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆకుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.