గులాబీ హ్యాట్రిక్ పక్కా
* అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటనున్న బీఆర్ఎస్
* దేశ రాజకీయాల్లో కీలకం కానున్న కేసీఆర్ పాత్ర
* ఆత్మీయ సమ్మేళనాలతో
పార్టీ శ్రేణుల్లో నయా జోష్
* మిర్యాలగూడ అభివృద్ధి
ప్రధాత ‘భాస్కర్ రావు
నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపొంది బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత అంటూ ప్రశంసించారు. ఆయన నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ పథకాలన్వే పకడ్బందీగా అమలవుతున్నాయంటూ కితాబిచ్చారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో మళ్లీ భాస్కర్ రావు గెలుపొందడం ఖాయమని, ఇక్కడ మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కృతనిశ్చయంతో అంకితభావంతో పని చేస్తున్నాయని అన్నారు. సోమవారం మిర్యాలగూడ మండల పరిధిలోని తక్కెళ్ళపహాడ్ గ్రామంలోని
లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ లో మిర్యాలగూడ మండలానికి చెందిన దొండవారిగూడెం, జైత్య తండ, తడకమళ్ళ, తక్కెళ్ళపహాడ్ తండ, తక్కెళ్ళపహాడ్, ఉట్లపల్లి, కాల్వపల్లి తండ, కాల్వపల్లి, యాద్గార్ పల్లి గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బండా నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన కేసీఆర్ పాత్ర కీలకం కానుందని అన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ శ్రేణుల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.’మోడీ హఠావో…దేశ్ కో బచావో’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. అబ్ కీ బార్…కిసాన్ కీ సర్కార్ నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న ప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు,మతాల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని వారిని నమ్మవద్దని కోరారు. శ్రుతి మించుతున్న బీజేపీ దుర్మార్గాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్న శక్తి సామర్ధ్యాలు ప్రత్యర్థులకు ఏ మాత్రం లేవని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 9ఏండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా అమలుకావడం లేదన్నారు. వచ్చే నెల 20వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్టీ శ్రేణులంతా ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీజేపేతర పాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను కేంద్ర ప్రభుత్వం తమ స్వార్ధ రాజకీయాల కోసం ఏవిధంగా ఉపయోగించుకుంటున్నదో ప్రజలకు తెలియజేయాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సందేశాన్ని కార్యకర్తలకు ఆయన చదివి వినిపించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాష్ట్రం అవిర్భవించక ముందున్న పరిస్థితులు, రాష్ట్ర ఏర్పడ్డాక మారిన ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని కార్యకర్తలకు అర్ధమయ్యే విధంగా వివరించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ముగిసిన తర్వాత వచ్చేనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వచ్చేనెల 27న ప్రతి గ్రామంలోని వార్డుల్లో జెండా పండుగ ఘనంగా నిర్వహిస్తామని బండా నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, ఏ ఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, మండల పార్టీ అధ్యక్షుడు మట్టపల్లి సైదులు యాదవ్, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షుడు గడగోజు ఏడుకొండలు, పాక్స్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, మన్నెం మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్ధ, సర్పంచులు చౌగాని బిక్షం గౌడ్, పాశం నరసింహారెడ్డి, అలకాని సుజాత రమణ, దొండ రామరాజు, నామ అలెగ్జాండర్, దుండిగాల యాదమ్మ శ్రీనివాస్, భూక్య సైదమ్మ మంజ్య, ఎంపీటీసీలు పాశం హైమావతి, తలకొప్పుల సైదులు, నకిరేకంటి కలమ్మ వెంకన్న, ఉప సర్పంచులు, గ్రామపార్టీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, మహిళలు, యువకులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.