రాంగ్ రూట్లో ఆటోను
గుద్దిన డిసిఎం
ఒకరి మృతి మరో
ఇద్దరి పరిస్థితి విషమం
అక్షిత ప్రతినిధి, వేములపల్లి : పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
రాంగ్ రూట్లో ఆటోను డిసిఎం వాహనం డికొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మధులత, మరో వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే…వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని మిరియం అనాధ ఆశ్రమం వద్ద నార్కెట్ పల్లి అద్దంకి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిసిన ప్రకారం సంఘటన వివరాలు మాడ్గులపల్లి మండలం పూసలపాడు గ్రామంలో జరిగిన బంధువుల పుట్టినరోజు వేడుకకు వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తుండగా తౌడు లోడుతో రాంగ్ రూట్లో వచ్చిన డీసీఎం ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మధులత (18) అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.మరో ముగ్గురికి తీవ్రమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహంతో పాటు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.