పది పరీక్షలకు 107 పరీక్షా కేంద్రాలు
ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పరీక్షలు
పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్
గ్యాడ్జెట్స్ లకు అనుమతి లేదు
జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 వ తేదీ నుండి ప్రారంభ కానున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్-13వ తేదీ వరకు ఉదయం 9-30 గంటల నుండి మధ్యాహ్నం 12-30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 న ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలుజరుగనున్నాయని ఆయన తెలిపారు.
సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడంతో పాటు పర్యవేక్షణ కోసము ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విధిగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
*పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్
గ్యాడ్జెట్స్ లకు అనుమతి లేదు*
పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు, చీఫ్ సూపరింటెండెంట్ సహా సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదని జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి స్పష్టం చేశారు.