ప్రెస్ క్లబ్ బలోపేతానికి
సమిష్టి కృషి చేద్దాం
కోదాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా బసవాచారి
సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్
కోదాడ టౌన్, అక్షిత న్యూస్ :
కోదాడ ప్రెస్ క్లబ్ ను మరింత పటిష్ఠవంతంగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు. మంగళవారం కోదాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి మీడియా అకాడమీ చైర్మన్, టియుడబ్ల్యుజే 143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ విశిష్ఠ కృషి చేస్తున్నారన్నారు. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరిస్తూ సూర్యాపేట జిల్లాలోనే కోదాడ ప్రెస్ క్లబ్ ఆదర్శ వంతంగా నిలువాలని ఆయన ఆకాంక్షించారు. అందరిని సమన్వయం చేసుకుంటూ కోదాడ ప్రెస్ క్లబ్ ను మరింత పటిష్ఠ వంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని ఆయన కోరారు.
కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా కోదాడ అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక, అక్షిత టివి ప్రతినిధి జూలురు బసవాచారిని నియమిస్తూ సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కార్యదర్శిగా ఎన్నికైన జూలూరు బసవాచారి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్, టియుడబ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షులు వజ్జే వీరయ్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బంకా వెంకటరత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి నారపరాజు హరికిషన్, ఎలక్ట్రాన్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు పడిశాల రఘు, నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిలంచర్ల హరి, ప్రధాన కార్యదర్శి మాతంగి సురేష్ ,యూనియన్ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాసరావు, నియోజవర్గ ప్రధాన కార్యదర్శి మరికంటి లక్ష్మణ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తంగెళ్లపల్లి లక్ష్మణ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ నియోజకవర్గంలో అందరి సహకారంతో ప్రెస్ క్లబ్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కాగా పాత్రికేయుడు బసవాచారి పదవికి ఎంపిక కావడం పట్ల పలువురు బంధువులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.