ప్రజలపై పన్నులు… కార్పొరేట్లకు రాయితీలు…

ప్రజలపై పన్నులు…

కార్పొరేట్లకు రాయితీలు…

 మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
ఏప్రిల్ 5న చలో ఢిల్లీ

మాజీ ఎమ్మెల్యే‌ జూలకంటి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ప్రజలపై పన్నులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ దేశ సంపదను దోచుకు తింటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు.

శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోడీ సర్కార్ ను గద్దె దించితేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. కనీస మద్దతు ధర సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకంలో బడ్జెట్ పెంచి పది దినాలు పెంచి పని భద్రత కల్పించాలని కోరారు కేంద్ర మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న చలో ఢిల్లీ మజ్దూర్ కిసాన్ సంఘర్ష ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది రైతులు రైతు కూలీలు కార్మికులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది పాల్గొంటున్నారని తెలిపారు. రైతులు రైతు కూలీలు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కనీస వేతనం 26వేలు, పెన్షన్ 10వేలు అందరికీ చెల్లించాలని, అగ్నిపత్ స్కీంను రద్దు చేయాలని డిమాండ్ చేశారు గ్యారెంటీతో కూడిన సేకరణ పాటు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర అందిన చట్టబద్ధత కల్పించాలన్నారు పేద మధ్యతరగతి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలని 60 ఏళ్లు పైబడిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలన్నారు నాలుగు లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలన్నారు. ధరల పెరుగుదలను అరికట్టాలని ఆహార వస్తువులు, నిత్యావసర సరుకులపై జిఎస్టి ని ఉపసంహరించుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంట గ్యాసులపై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరింప చేయాలని కోరారు. ఏప్రిల్ 5న జరిగే చలో ఢిల్లీకి రైతులు కార్మికులు రైతు కూలీలు అధిక సంఖ్యలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు భవాండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పిల్లుట్ల సైదులు, వెంకట్రెడ్డి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు నల్లగుంట్ల సోమయ్య, నాయకులు బాబు నాయక్, జగన్నాయక్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking