ఆస్తిపన్ను వసూలులో ముందుండాలి

ఆస్తిపన్ను వసూలు ముందుండాలి

మిర్యాలగూడ బడ్జెట్
2023-24 నో మిగులు

ఆదాయం… ఖర్చు సమానం

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ఆస్తి, ఇతర పన్నులు ఖచ్చితంగా వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కోరారు. చైర్మన్
తిరునగరు భార్గవ్‌ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నూటికి నూరు శాతం పన్నుల వసూలుకై అధికారులు, సిబ్బంది పని చేయాలన్నారు. బకాయిల విషయంలో దృష్టి సారించాలని కోరారు.

మిర్యాలగూడ మునిసిపాలిటి 2023-24 న ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.9323.10 లక్షలకు ఆదాయం, వ్యయమును అమోదించారు. ఇందులో ఆదాయంగా ఇంటి పన్నులు, రూ.1360.00 లక్షలు, ఇతర పన్నులు _రూ.1196.10 లక్షలు మొత్తం రు.2556.10లక్షలు వ్యయంగా రూ.984.00 లక్షలు, పారిశుధ్యానికి 379.00 లక్షలు, గ్రీన్ బడ్జెట్ కు రూ.255.61 లక్షలు, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్, పట్టణ ప్రణాళిక, ఇతర వ్యయాలు రు.482.50 లక్షలు, ఇతర ఖర్చు రూ.454.99 లక్షలు, మొత్తం వ్యయంగా రూ.2556.10 లక్షలు అదేవిధంగా ప్రభుత్వ గ్రాంట్స్ ప్లాన్ గ్రాంట్స్ రూ.1090 లక్షలు, నాన్ ప్లాన్ గ్రాంట్స్ రూ.900.00 లక్షలు ఇతర గ్రాంట్స్ రూ.4737.00లక్షలు మొత్తం ఆదాయంగా రూ.6727.00 లక్షలు, ఇంటి, ఇతర పన్నులు రూ.2556.10లక్షలు, గ్రాంట్లు రూ.6727.00లక్షలు కలిపి రూ.9323.10లక్షలు‌ ఆధారంగా చూపి ఆమోదించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking