అప్పుల కుప్పగా తెలంగాణ

కేసిఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలు 

జన నీరాజనం 

బిఎల్ఆర్ బ్రదర్స్

అక్షిత న్యూస్, మాడుగులపల్లి : పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ఎనిమిదేళ్ల పాలనలో అప్పుల పాలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం అని బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

5వ రోజు హత్ సే హత్ జోడో యత్రలో భాగంగా బొమ్మకల్ గ్రామం నుంచి మొదలై దేవతల బాయిగూడెం, గణపతి వారి గూడెం మీదుగా తోపుచర్లకు చేరుకుంది. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆయనకు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది యువత ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లో ఉందని హెచ్చరించారు, నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పట్టణానికి బయలుదేరి ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటూన్నారని , కొంతమంది చెడువసనాలకు బానిసలు అవుతూన్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్, మాడుగులపల్లి జడ్పిటిసి పుల్లెంల సైదులు,డిసిసి ఉపాధ్యక్షుడు రావు ఎల్లారెడ్డి, తోపుచర్ల సర్పంచ్ మంగ యాదయ్య, చింతకుంట్ల వెంకటరెడ్డి, మీనా రెడ్డి,సైదా నాయక్,నిరంజన్,కట్ట శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు బి ఎల్ ఆర్ బ్రదర్స్ అభిమానులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking