నేలకొండపల్లిలో బస్టాండ్ బస్ షెలర్ట్ లేక ప్రయాణీకుల తీవ్ర ఇబ్బందులు
-పట్టించుకోని పాలకులు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంకు కూతవేటు దూరంలో ఉన్న నేలకొండపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ బస్ షెలర్ట్ లేక మండల ప్రజలు విధ్యార్దులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఉన్న బస్టాండ్ ని ప్రవేట్ వ్యక్తులకు పంక్షన్ హాల్ కీ లీజుకీ ఇవ్వటంతో బస్సులు రోడ్ల పైనే ఆగుతున్నాయి.నేలకొండపల్లి మండలంలో 32 గ్రామాల నుండి నిత్యం ఖమ్మం కోదాడ వైపు వందల మంది రాకపోకలు కోనసాగిస్తుంటారు.వందల మంది విధ్యార్దులు ఖమ్మం కళశాలలకు వెళ్తుంటారు.పియస్సార్ రింగ్ సెంటర్లో రోడ్డు ప్రయాణీకులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఏండకు ఏండుతూ వానలకు తడుస్తూ ప్రయాణీకులు విధ్యార్దులు గర్బీణీ స్త్రీలు బస్సులకోసం నిలబడాల్సి వస్తుంది.కనీసం ఖమ్మం కోదాడ వైపు వెళ్ళే స్టాప్ లల్లో బస్ షెలర్ట్ నిర్మించి ప్రయాణీకులకు కుర్చునే సౌకర్యం కల్ఫించాలని సామాజీక కార్యకర్తలు పలు రాజకీయ నాయకులు విన్నవించిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదు.నేలకొండపల్లి లో రోడ్లు వెడల్పు చేసినా బసు షెలర్ట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అసవే వేసవి కాలం కావటంతో ఏండలో నిలబడిన ప్రయాణీకులు స్ప్రుహ తప్పి పడిపోతున్నారు.
నేలకొండపల్లి బస్టాండ్ అందుబాటులోకి తెవాలి
-సిపిఐ నేత మారిశెట్టి వెంకటేశ్వర్లు

నేలకొండపల్లి బస్టాండ్ స్థలాన్ని లీజు రద్దు చేసి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుక రావాలి.లేదంటే ఉధ్యమానికి సిద్దం.సిఎం కేసిఆర్ నేలకొండపల్లి కి కేటాయించిన పదికోట్ల ప్యాకేజీతో సెంటర్లో ఖమ్మం వైపు కోదాడ వైపు బస్ షెలర్ట్ లను నిర్మించి మండల ప్రయాణీకుల కష్టాలు తీర్చాలి.