మహిళా సంఘం గోదాం నిర్మాణానికి భూమి పూజ
70 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభం
అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
నాగర్‌కర్నూల్, అక్షిత ప్రతినిధి
లింగాల మండల కేంద్రంలోని మహిళా సమైక్య భవనం ఆధ్వర్యంలో గోదాం నిర్మాణానికి 70 లక్షల నిధులు మంజూరు చేసినట్లు అచ్చంపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బుధవారం తాసిల్దార్ కార్యాలయం వెనకాల ఉన్న ప్రభుత్వ స్థలంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉందని. ప్రతి మహిళా సంఘం అభివృద్ధి చెందాలని దిశగా నిధులు మంజూరు చేస్తూ మండల స్థాయిలో గోదాం నిర్మాణం చేపట్టేందుకు 70 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇట్టి పనులు త్వరితరగ పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసులు. ఐకెపి ఎపిఎం విజయ. సీసీలు రూప్ సింగ్. చందు. తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.