నల్లబండగూడెం సాయి మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

నల్లబండగూడెం సాయి మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి 

కోదాడ అక్షిత ప్రతినిధి

కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం సాయిబాబా మందిరంలో దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా వేద పండితులు, వేదమంత్రాల మధ్య నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాయిబాబా ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుఖశాంతులతో జీవించాలని అన్నారు హిందూ దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి అందిస్తానని ఆమె తెలిపారు పెద్ద ఎత్తున తరలివచ్చిన నల్లబండగూడెం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఆమె గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన చైర్మన్ నల్లపాటి నరసింహారావును అభినందించారు ఈ సందర్భంగా దాతల సహకారంతో దేవాలయ కమిటీ ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నదాన కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి , జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు , మాజీ ఎడమ కాల్వ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కోదాడ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సామినేని ప్రమీల నల్లబండగూడెం సర్పంచ్ రావుల భవాని సర్వేశ్వరరావు మాజీ సర్పంచ్ ముండ్రా రంగారావు. మాజీ ఎంపీపీ మల్లెల రాణి, క్షత్రియ, వీధిలాపురం శ్రీను, బట్టు పూర్ణ, శ్యాము సుధాకర్, రామచందర్రావు, గురవయ్య, ఎన్ఆర్ఐ అనన్య డాటర్ ఆఫ్ వెంకన్న , వేద పండితులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking