గురుపౌర్ణమి పర్వదినాన కొండగట్టు గిరిప్రదక్షిణ
రైతుల సంక్షేమం, సమృద్ధి వర్షాల కోసం ప్రత్యేక పూజలు
కరీంనగర్
కరీంనగర్ అక్షిత ప్రతినిధి
ప్రజా సంక్షేమం కోసం వర్షాలు సమృద్ధిగా పడాలని, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని బుధవారం గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు “డాక్టర్ మేడిపల్లి సత్యం” ఆధ్వర్యంలో కొండగట్టు గిరిప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ “ఒడితల ప్రణవ్ బాబు” మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, అంజన్న భక్తులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా కాంగ్రెస్ నేతలు, భక్తులు కొండగట్టు గిరిప్రదక్షిణను పూర్తి చేసి, అనంతరం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ,” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోరుతూ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, “ఎల్-నినో వైపరీత్యం ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గతంలో హైదరాబాద్ లాల్ దర్వాజా అమ్మవారు వేములవాడ రాజన్న ఆలయం కొండగట్టు అంజన్న ఆలయం ఇలా ఏ పుణ్యక్షేత్రంలో అయినా ఇలాంటి విపత్తుల సమయంలో ప్రజలు నమ్ముకున్న దేవుళ్ళు వారిని రక్షించారు, 43 వ సారి పౌర్ణమి రోజున జరుగుతున్న ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా వర్షాలు కురవాలని, పంటలు సుభిక్షంగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని లోక కళ్యాణం కోసమే కొండగట్టు అంజన్నను ప్రార్థించాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని జిల్లా అభివృద్ధి కోసం మేమంతా ఎప్పుడు కలిసే పని చేస్తామని ఇది ఏ పార్టీకి, ఏ వర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదు. సకలజనుల సంక్షేమం కోసం చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం అని అన్నారు.“మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. కొండగట్టు క్షేత్రాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తాం.”ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ “రైతుల కష్టాలు తీరాలని, రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఆధ్యాత్మిక భావనతో ఈ గిరిప్రదక్షిణ చేపట్టాం. కొండగట్టు అంజన్న ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. భారీ వర్షంలోనూ పాల్గొన్న ప్రతి భక్తుడికి, కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సర్పంచులు, కార్పొరేటర్లు కౌన్సిలర్లు సహకార సంఘాల చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్ లు పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు ఇతర ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.