సర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పనులు 94 శాతం పూర్తి 

సర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పనులు 94 శాతం పూర్తి 

ఎన్నికల నమోదు అధికారి జె.ఎల్.బి. హరిప్రియ

జడ్చర్ల అక్షిత న్యూస్ :

జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పనులు 94.35 శాతం పూర్తయ్యాయని రెవెన్యూ అదనపు కలెక్టర్, జడ్చర్ల శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి జె.ఎల్.బి. హరిప్రియ తెలిపారు.బుధవారం జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ప్రజలు తమ ఎన్యూమరేషన్ ఫారాలను చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా సమర్పించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు అవగాహన కల్పించాలని ఈఆర్‌ఓ కోరారు. గడువు సమీపించే సమయంలో పోర్టల్, మొబైల్ యాప్‌లపై అధిక రద్దీ ఏర్పడి ఫారాల సమర్పణలో జాప్యం ఏర్పడే అవకాశం ఉన్నందున ముందుగానే ఫారాలను సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్చర్ల, మిడ్జిల్, రాజాపూర్, బాలానగర్, ఊర్కొండ మండలాల తహసీల్దార్లు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు జడ్చర్ల మున్సిపల్ కమిషనర్, అదనపు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, అలాగే జడ్చర్ల శాసనసభ నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking