ప్రకృతి సమతుల్యత కాపాడటంలో పులుల పాత్ర కీలకం.
పులుల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్వేజ్ అహ్మద్.
గద్వాల అక్షిత న్యూస్.
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్వేజ్ అహమ్మద్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక అభ్యాస పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి, పులుల సంరక్షణ,జీవవైవిధ్య పరిరక్షణ,అడవుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌వో పర్వేజ్ అహ్మద్ మాట్లాడుతూ,పులులు ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని,వాటి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. అడవులు,వన్యప్రాణులను పరిరక్షించేందుకు చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.అనంతరం విద్యార్థులు పులుల సంరక్షణ,అడవుల పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశారు. వ్యాసరచన,చిత్రలేఖన పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పులుల పరిరక్షణపై తమ ఆలోచనలను వ్యాసాలు,చిత్రాల రూపంలో సృజనాత్మకంగా ఆవిష్కరించారు.ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్వేజ్ అహ్మద్ చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేసి వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో రేంజ్ సిబ్బంది,పాఠశాల సిబ్బంది విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.