గ్రామాల అభివృద్ధికి సర్పంచులు అధికారులు కృషి చేయాలి

గ్రామాల అభివృద్ధికి సర్పంచులు అధికారులు కృషి చేయాలి

లింగాల మండల సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే

అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

నాగర్‌కర్నూల్, అక్షిత ప్రతినిధి

లింగాల మండల కేంద్రంలోని మండల పరిషత్తు అభివృద్ధి కార్యాలయంలో బుధవారం సర్వసభ సమావేశం నిర్వహించారు ఇట్టి సర్వసభ సమావేశానికి ముఖ్యఅతిథిగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు సర్పంచులు, అధికారులు కృషి చేయాలని అన్నారు. గ్రామాలలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని. నిరుపేదలు కాని వారికి మంజూరు చేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒకటో విడత మంజూరైన ఇల్లు మొత్తం పూర్తి చేయాలని. ఎక్కడైతే ఇంకా గ్రామాలలో పూర్తికాని ఇల్లు ఉంటే వారి ఇండ్లకు వెళ్లి వారికి అవగాహన కల్పించి నిర్మించుకునే విధంగా కృషి చేయాలని అన్నారు. బిల్లులు రాకుండా లబ్ధిదారులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని అన్నారు .గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు పక్కదారి పట్టిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని అన్నారు. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు కావలసిన నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని , గ్రామాలలో సమస్యలు లేకుండా అందరు కూడా కృషి చేయాలని అన్నారు. కొన్ని గ్రామాలలో లక్షలాది నిధులు మంజూరైనప్పటికీ అట్టి నిధులు పక్క దారి పడుతున్నాయని నా దృష్టికి వచ్చిందని ఆ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై చర్యలు తీసుకునే విధంగా పై అధికారులకు ఆదేశిస్తారని అన్నారు. గ్రామాలలో అర్హులైన ప్రతి వృద్యాప పెన్షన్ మంజూరు చేయాలని. వీడో పెన్షన్ మంజూరు చేయాలని. గ్రామాలలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఉండరాదని సూచించారు. గ్రామాలలో అధికారులు సమయపాలన పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల కేంద్రంలో ఉన్న వసతి గృహాలలో విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని మండల అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు వసతి గృహాలు తనిఖీ చేసి జిల్లా అధికారులకు నివేదికలు పంపాలని కోరారు. రాత్రి వేళలో వసతి గృహాలలో బస చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మెనూ ప్రకారం భోజనం అందజేసే విధంగా ప్రజా ప్రతినిధులు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాబోయే వర్షాకాలంలో గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామ పంచాయతీల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఎంపీడీవో . మరియు ఎంపీ ఓ చూడాలని. అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు. డివిజనల్ పంచాయతీ అధికారి వెంకట ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి. సూపర్డెంట్ కృష్ణయ్య. సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్. సింగిల్ విండో చైర్మన్ జంబుల హనుమంత్ రెడ్డి. ఆర్డబ్ల్యూఎస డి ఈ. పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసులు. తాసిల్దార్ బి వెంకటేష్. వ్యవసాయ అధికారి అనిల్. మండల విద్యాధికారి బషీర్ అహ్మద్. డిప్యూటీ తాసిల్దార్ కృష్ణాజి. ఆర్ ఐ అనిల్. ఆర్ ఐ ఇందిరా. జి పి ఓ లు. పంచాయతీ కార్యదర్శులు. గ్రామాల సర్పంచులు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking