జూరాల కుడి కాలువకు నీటిని విడుదల చేసిన 

జూరాల కుడి కాలువకు నీటిని విడుదల చేసిన 

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

గద్వాల అక్షిత న్యూస్.

గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడికాలువ కు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులతో కలిసి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన చేతుల మీదుగా సాగు నీరు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ నీళ్లు విడుదల చేయడానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు,వాకిటి శ్రీహరి మరియు ఉమ్మడి పాలమూరు జిల్లా సహచర ఎమ్మెల్యేలకు గద్వాల ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఎల్ నీ నో ప్రభావంతో ఎక్కువ వర్షం పాత నమోదు కాలే నందున వర్షం లేకపోవడం వల్ల నీళ్ల ఇబ్బంది ఉందని అయినా కూడా ప్రభుత్వం సీఎం ఉమ్మడి జిల్లా ప్రాంత వాసి కాబట్టి రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి రైతులకు పంటలు వేసుకునే నాట్లు వేసుకునే సమయంలో కొంత మేరకు సాగునీటి విడుదల చేయడం జరుగుతుందని, 30 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందించడమైదన్నారు.రైతులు నీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలని,రెండు పంటలకు ఉపయోగించుకోవాలని దశలవారీగా నీటిని వినియోగించుకోవాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు.నారాయణపూర్ డ్యామ్ నుండి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువన జూరాలకు నీటిని విడుదల చేయనున్నారు. రైతులు వరి పంటలు వేయకుండా నీటిని తక్కువగా ఉపయోగపడే పంటలను వేయాలని శాస్త్రవేత్తలు సూచించే పంటలను వెయ్యాలని,అదేవిధంగా వ్యవసాయ అధికారులు సూచించే పంటలను వేసి ఆకుకూరలు పండ్లు కూరగాయలు వంటి పంటలను పండించాలని అప్పుడే నీటి ఎక్కువ వృధా కాకుండా సరిపడా నీటిని ఉపయోగించుకోవాలన్నారు.రైతులు కూడా వ్యవసాయ అధికారులకు సహకరించాలని, అప్పుడే నీళ్లు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు..ప్రభుత్వాలు వచ్చిన రైతుల సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని.కావున రైతులు ఇబ్బందులు అపోహాలు చెందవద్దండి అన్ని విధాలుగా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.నడిగడ్డ లో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. జూరాలకు వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా ర్యాలంపాడు, గూడెందొడ్డి పంపు మోటార్లు ఇప్పటికే పంపింగ్ చేశామని, రిజర్వాయర్ల ద్వార కాలువలకు సాగు నీరు వదలడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల జయలక్ష్మి నర్సింహులు యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ హన్మంతు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, జిల్లా సీనియర్ నాయకులు, రైతులు, అధికారులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking