మత్స్యాద్రి ఆలయ చైర్మన్ గా తుమ్మల శ్రీనివాస్ ప్రమాణస్వీకారం

మత్స్యాద్రి ఆలయ చైర్మన్ గా తుమ్మల శ్రీనివాస్ ప్రమాణస్వీకారం

వలిగొండ/ అక్షిత న్యూస్:

వలిగొండ మండలంలోని మత్స్యగిరిగుట్ట ఆలయ చైర్మన్ గా తుమ్మల శ్రీనివాస్ బుధవారం రోజున ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చైర్మన్ ఏవిధంగా ధర్మకర్తలందరూ కూడా నియమ నిష్టలతో మీ వారి కృపతో ఆలయ అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేయాలని వారన్నారు. అదేవిధంగా చైర్మన్ తుమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ తన నాన్న తుమ్మల నరసయ్య మీద ఉన్న అభిమానంతో తనకు పదవిని కట్టబెట్టినందుకు అంకితభావంతో ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కొత్తపల్లి వెంకటయ్య ఆలయ ధర్మకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking