అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

-కొల్చారం, పాపన్నపేట మండలాల్లో 186 దరఖాస్తులు.

మెదక్ అక్షిత బ్యూరో:

మెదక్ పట్టణంలోని సిడిపిఓ కార్యాలయంలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించినట్లు మెదక్ సీడీపీఓ వెంకటరమణమ్మ తెలిపారు.మెదక్ ప్రాజెక్టు పరిధిలోని కొల్చారం, పాపన్నపేట మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన వెరిఫికేషన్ కు అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 5 పోస్టులకు 186 మంది దరఖాస్తు చేయగా, 102 మంది వెరిఫికేషన్ కు హాజరైనట్లు సీడీపీఓ తెలిపారు.కొల్చారం మండలంలోని 2 పోస్టులకు 74 మంది దరఖాస్తు చేసుకోగా, 38 మంది హాజరయ్యారు. పాపన్నపేట మండలంలోని 3 పోస్టులకు 112 మంది దరఖాస్తు చేయగా, 64 మంది వెరిఫికేషన్ కు హాజరయ్యారు.భర్తీ జరుగుతున్న ఖాళీల్లో కొల్చారం మండలంలోని రంగంపేట–2, కొంగోడ్ సెంటర్–2, పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి సెంటర్–2, అర్కెల సెంటర్–2, లక్ష్మీనగర్ తండా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని సీడీపీఓ వెంకటరమణమ్మ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking