అభివృద్ధి పనులతో తుంగతుర్తి ప్రజల్లో ఆనందం 

అభివృద్ధి పనులతో తుంగతుర్తి ప్రజల్లో ఆనందం 

తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేల్ 

సూర్యాపేట , అక్షిత ప్రతినిధి :

తుంగతుర్తి నియోజక వర్గంలో చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆనందం వెల్లువిరుస్తోందని తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేల్ అభిప్రాయ పడ్డారు.ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి చలువ వల్లనే జరుగుతోందని స్పష్టం చేశారు.బుధవారం.సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలంలోని ఉయ్యాలవాడ ఆవాసం కుమ్మరిగుడెంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను,కోడూరు గ్రామంలో అంగన్వాడీ నూతన భవనాన్ని ఆయన ప్రారంభిoచి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం అంగన్వాడీ పాఠశాలలో చదివే చిన్నారులకు స్కూల్ డ్రెస్ పంపిణీ చేశారు.తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలోని కుంచమర్తి గ్రామంలో వరినాట్లు వేస్తున్న మహిళా కూలీల వద్దకు వెళ్ళి కాసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా వారికి రూ.5 వేలను అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపెల్లి మధుకర్ రెడ్డి,సర్పంచులు పాశం కరుణ భాస్కర్ రెడ్డి,వల్లపు అవిలమ్మ సోమయ్య,చిల్లంచర్ల విద్యాసాగర్, లూనావత్ కృష్ణా నాయక్,ఉప సర్పంచ్ కోటమర్తి మేనకా వెంకన్న,నాయకులు జీడి వీరస్వామి,పాలెల్లి సురేష్, దాసరి సోమయ్య, ఊటుకూరి రవీందర్,బొడ్డు నాగరాజు,తాటిపాముల జలెందర్, వల్లపు సంపత్,పిట్టల రమేష్, తహశీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో ఝాన్సీ,జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking