కన్నుల పండువగా
రాములోరి కళ్యాణం
వైభవంగా సీతారాముల కల్యాణం
భువనగిరి, అక్షిత ప్రతినిధి : సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణ వేడుకలు జరుపుకుండ్రు.

భువనగిరి మండలంలోని కూనూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఎంపీటీసీ పాశం శివానంద్ ఆధ్వర్యంలో పచ్చని పందిరిలో గ్రామస్తులు అందరూ హాజరవగా అట్టహాసంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామస్తులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.