స్థలాల క్రమబద్దీకరణకు గడువు

స్థలాల క్రమబద్దీకరణకు గడువు

జిఓ 58,59 ద్వారా ప్రభుత్వ స్థలాల క్రమబద్ధికరణకు కట్ ఆఫ్ తేదీ 2 జూన్ 2014 నుండి 2
జూన్ 2020 వరకు పొడిగింపు

ఏప్రిల్ 1 నుండి 30 వ తేదీ వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ నెంబర్ 58,59 ద్వారా ప్రభుత్వ స్థలాలలో ఇండ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వ స్థలాల క్రమబద్ధికరణ కొరకు 2 జూన్ 2014 వ తేదీ వరకు ఉన్న కట్ ఆఫ్ తేదీని 2 జూన్ 2020 వరకు పెంపు చేసినందున అర్హులైన వారు స్థలాల క్రమబద్దీకరణకు ఈ నెల ఒకటి నుండి 30 వ తేదీ వరకు
మీ సేవ కేంద్రంల ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యంతరం లేని ప్రభుత్వ భూములపై క్రమబద్ధికరణ, హక్కుల బదిలి చేయుట కొరకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ స్థలాల్లో 125 చ. గ.లలో ఇళ్ళు నిర్మించు కున్న వారికి అభ్యంతరం లేని భూములకు జి. ఓ 58 ద్వారా ఉచితంగా క్రమబద్దీకరణ చేసి హక్కులు కల్పించనున్నట్లు,125 చ. గ.లు దాటిన ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి మార్కెట్ రేట్ ప్రకారం ధర ఖాస్తులు విచారణ చేసి అర్హులైన వారికి క్రమబద్దీకరణ హక్కులు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.కనుక ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మీ సేవ ద్వారా ఈ నెల 30 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఈ ప్రకటన లో కలెక్టర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking