అత్తాపూర్ డివిజన్ లో ప్రజాసమస్యల పరిష్కారమే ద్యేయం.సంగీత రాజేంద్రనగర్

అత్తాపూర్ డివిజన్ లో ప్రజాసమస్యల పరిష్కారమే ద్యేయం.సంగీత రాజేంద్రనగర్,

అక్షిత ప్రతినిధి: అత్తాపూర్ డివిజన్ ప్రజల సమస్యలు పరిష్కరించడమే తన ముందున్న కర్తవ్యమని డివిజన్ కార్పొరేటర్ మొండ్ర సంగీత అన్నారు.మంగళవారం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పలు బస్తీలలో పర్యటించారు.ప్రస్తుతం
ప్రజా సమస్యల పరిష్కారానికె అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.జిహెచ్ఎంసి మరియు ఇతర అన్ని శాఖల అధికారులతో ప్రతి బస్తీ కాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ ప్రజలను సమస్య లు అడిగి తెలుసుకున్నారు.రోడ్లు,డ్రైనేజి త్రాగునీరు లో ప్రెజర్ వీధిలైట్లు ఎప్పటికప్పుడు బాగు చేయడం వీధిలలో పారిశుధ్యం నిర్వహణ లేకపోవడం సిసి రోడ్లు లేకపోవడం ఇకమీదట పెండింగ్లో ఉంచకూడదని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.పలు కలనిలలో వీధి కుక్కల బెడద లేకుండా,చిన్నపిల్లలు మారకద్రవ్యాలకు అలవాటు పడి పార్కులలో బస్తీలలో గుర్తు తెలియని దుండగులు తాళా లు వేసి ఉన్న ఇంట్లో దొంగతనాలు పాల్పడడం వంటి వి అరికట్టాలని అంబంధిత జిహెచ్ఎంసి సిబ్బంది పోలీసు శాఖ, జలమండలి శాఖ అధికారులను విన్నవించారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి నోడల్ ఆఫీసర్ నరహరి హుడా కాలనీ అవుట్ పోస్ట్ ఎస్సై శ్రీకాంత్, జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ జావేద్, జిహెచ్ఎంసి ఎస్ఎస్ శేఖర్, వినయ్, వర్క్ ఇన్స్పెక్టర్ రాజు, ఎంటమాలజీ సిబ్బంది లక్ష్మినారాయణ, లైన్మెన్లు అఖిలేష్, వెంకటేష్, సంబంధిత అన్ని శాఖల వారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking