రాజేంద్రనగర్ లో జ్యోతిరావు పులేకు ఘనంగా నివాళులు.
రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి:
కుల వివక్షపై అలుపెరుగని పోరాటం చేసిన సంఘసంస్కర్త, బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధనకై, అణగారిన వర్గాల అభ్యున్నతికి పరితపించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలె 197వ జయంతి రాజేంద్రనగర్ నియోజకవర్గం అన్నిపార్టీల నేతలు కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. నార్సింగి,శంషాబాద్,రాజేంద్రనగర్,మణికొండ,బండ్లగూడా,మైలర్ దేవ్ పల్లి తదితర ప్రాంతాల్లో జ్యోతిరావు పూలే విగ్రహాలు,చిత్రపటలకు నేతలు పులమలలతో నివాళులు అర్పించారు.

రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాల అవరణంలోని పూలే విగ్రహానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,మాజీ ఎంపీ విఎచ్, బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్,మంత్రి తనయుడు పి.కార్తిక్ రెడ్డి,బిజెపి నార్సింగి మున్సిపల్ అధ్యక్షుడు చిక్కరి భిక్షపతి యాదవ్, కార్పొరేటర్లు పొడవు అర్చన,తోకల శ్రీనివాస్ రెడ్డి,సంగీత,తోపాటు బీఆర్ఎస్,బిజెపి,కాంగ్రెస్,తెలుగుదేశం,సీపీఎం,సిపిఐ పార్టీల నేతలతో పాటు సంఘసేవకులు,

జర్నలిస్టులు,పలుపార్టీల కార్యకర్తలు పాల్గొని పూలే విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం ఏర్పాటు చేసిన సభ కార్యక్రమంలో పలువురు నేతలు పూలే సమాజ శ్రేయస్సు కోసం చేసిన సేవలను కొనియాడారు.పూలే బడుగు బలహీన వర్గాలకోసం చేసిన కృషిని కొనియాడారు.పూలే జీవితం భావితరాలకు మార్గదర్శం అని పలువురు తమ ప్రసంగంలో కొనియాడారు