బిజెపి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పని చేయాలి
_బిజెపి జిల్లా అధ్యక్షులు ఏ దశమంత రెడ్డి
చేర్యాల,ఏప్రిల్ 11 అక్షిత ప్రతినిధి: జనగామ గడ్డపై బిజెపి జెండా ఎగర వెయ్యాలంటే ప్రతి కార్యకర్త ఒక సైనికుడు గా పని చేయాలని బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆరుట్ల దశమంత రెడ్డి అన్నారు. మంగళవారం చేర్యాల పట్టణ కేంద్రంలో బూత్ స్వశక్తి కరుణ అభియాన్ అనే కార్యక్రమాన్ని జనగామ అసెంబ్లీ కో కన్వీనర్ దండియాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా,ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జనగామ బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆరుట్ల దశమంత రెడ్డి హాజరై మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులకు మరియు సీనియర్ నాయకులకు మార్గదర్శనం చేసిన విషయాలు రానున్న ఎన్నికలలో జనగామ అసెంబ్లీ గడ్డపై బిజెపి జెండా ఎగరవేయడమే దేయంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్, సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి, రామదాసు,మహేందర్ రెడ్డి, విజయలక్ష్మి,బిక్షపతి రెడ్డి,5 మండలాల అధ్యక్షులు కాటం సురేందర్,కాశెట్టి పాండు,వెంకట్ రెడ్డి,బిక్షపతి నాయక్,భాస్కర్ రెడ్డి మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.