మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు మరువలేనివి * ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు

మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు మరువలేనివి

* ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లో బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భద్రాది కొత్తగూడెం బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల నాగేశ్వరావు గౌడ్ అధ్యక్షతన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో
ముఖ్యఅతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి, బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ చిన్ని, ఓ బి సి జాతీయ మీడియా సెల్ కోఆర్డినేటర్ కెవి రంగా కిరణ్ పాల్గొన్నారు. అనంతరం ఓ బి సి మోర్చా జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు గౌడ్, కె.వి రంగా కిరణ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు కార్యచరణ నేటికీ స్ఫూర్తిదాయకమేనని అన్నారు. దేశంలో మనుషులంతా అన్ని రంగాలలో సమానత్వంతో జీవించాలని, ఆదిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధార పోసిన గొప్ప భారతీయ సామాజిక తత్వవేత్త పూలే అని కొనియాడారు.

వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతే దేయంగా జ్యోతి రావు పూలే దాదాపు 200 ఎళ్ళ కిందటే కార్యక్రమం చేపట్టారాని తెలిపారు. గుణాత్మక మార్పు దిశగా దేశంలోని స్త్రీలు, దళిత బహుజనులు ఉద్యమించేలా పూలే కార్యచరణ చేపట్టారు. పూలే ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా తన గురువుగా ప్రకటించుకున్నారని, పూలే వంటి మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రవి గౌడ్, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, టీ.నరేంద్రబాబు, ఎడ్లపల్లి శ్రీనివాస్ కుమార్, పిల్లి రాజేశ్వరరావు, జల్లారపు శ్రీనివాస్, చింతలచెరువు శ్రీనివాస్, రాయుడు నాగేశ్వరరావు, పైడిపాటి రవీందర్, రాజేష్ నాయక్, గుమలాపురం సత్యనారాయణ, బీసీ సంఘం నాయకులు ఆముదాల వెంకట నరసయ్య, మాడిశెట్టి శ్రీనివాస్, గుండ్ల నర్సయ్య గౌడ్, జయమ్మ, ఎల్.రాజయ్య గౌడ్, బిర్ర నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking