భారతదేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని అందజేసిన ఘనుడు : మహాత్మ జ్యోతిరావు పూలే
నకిరేకల్ అక్షిత ప్రతినిధి:
రామన్నపేట మండలం నీరు నేముల గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది, అనంతరం వారు మాట్లాడుతు అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు, తన సతీమణిని భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా తీర్చిదిద్దారు, స్త్రీలలో వెనుకబాటుతనాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో వారిని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ నిరంతరం వారి యొక్క అభ్యున్నతికి పాటుపడుతూ ముందుకు నడిచారు, 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసి అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు అని తెలియజేశాడు అని అన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆవుల నరసింహ యాదవ్, చల్ల సత్య ప్రకాష్, మాజీ ఉపసర్పంచ్ గంగుల వెంకటరెడ్డి, సామాజిక కార్యకర్త నోముల యాదగిరి, నోముల చిరంజీవి, వార్డు సభ్యులు నాగటి మహేష్, సుర్వి సతీష్, ఆవుల అంజయ్య, శివ, నోముల నారాయణ, నోముల మల్లేష్, రామచంద్రం, నోముల తిలక్, లింగయ్య, వంశీ, సత్తయ్య, సూరి బాలరాజ్, సుర్వి సత్తయ్య, నరసింహ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.