ఎంపీడీవో కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఎంపీడీవో కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

చేర్యాల,ఏప్రిల్ 11 అక్షిత ప్రతినిధి: మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి సందర్భంగా మంగళవారం చేర్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడితే పూలే సమాజంలో అణగారిన వర్గాల కోసం విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త, అని సామాజిక తత్వవేత్తగా సమ సమాజ స్థాపనకై అహర్నిశలు కృషి చేసి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి తరతరాలగా అణచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు తాను అండగా నిలిచిన గొప్ప మహనీయుడని కొనియాడారు.జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ మనమందరం వారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు గూడూరు బాలరాజు, ఆకునూరు ఎంపీటీసీ సుంకరి శ్రీధర్ గౌడ్,ఎంపీఓ మహబూబ్ అలీ, కొత్తదొమాట సర్పంచ్ బిక్షపతి, అసిస్టెంట్ ఇంజనీర్ శివ కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking